హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS గ్రామ అధ్యక్షుడిని పరామర్శించిన.. మాజీ MLA

BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఇటీవల మృతిచెందిన రామిడి రాధమ్మ కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం అనారోగ్యంతో ఇంటివద్ద కోలుకుంటున్న BRS గ్రామశాఖ అధ్యక్షుడు ఏడెల్లి మల్లారెడ్డి, కాలికి గాయమైన కర్కపల్లి మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు రాంనర్సింహారావును పరామర్శించారు.