MNCL: కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి తండా-డి గ్రామంలో '‘నేను సైతం' కార్యక్రమంలో భాగంగా అజ్మీర తిరుపతి గురువారం 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్సై గంగారం కెమెరాలు ప్రారంభించి తిరుపతిని అభినందించి ఘనంగా సన్మానించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు సులభమవుతుందని ఎస్సై తెలిపారు.
తెలంగాణ
'సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ'


