ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. భారతదేశం తనకు సెకండ్ హోమ్(రెండో ఇల్లు) లాంటిదని మనసులోని మాటను బయటపెట్టాడు. సొంత దేశం ఆస్ట్రేలియా కంటే కూడా భారత్‌లోనే తనకు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని వాట్సన్ అన్నాడు. ఇక్కడి ప్రజల నుంచి తనకు ఎంతో గొప్ప ఆదరణ, అంతులేని ప్రేమ లభించాయని సంతోషం వ్యక్తం చేశాడు.
క్రీడలు
ఇండియా నా రెండో ఇల్లు: వాట్సన్


