హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి పూర్తి చేయాలని నిరసన

ASF: కాగజ్ నగర్-దహెగాం ప్రధాన రహదారిని వెంటనే పూర్తి చేయాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కొత్మీర్ నుంచి పెసరగుంట వరకు ప్రధాన రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డు పనులు పూర్తి చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.