హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో విషాదం

BDK: మణుగూరు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సిస్కాన్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ సైట్‌ ఇంఛార్జిగా పనిచేస్తున్న కోటంశెట్టి సోమశేఖర్‌(36) గుండెపోటుతో మృతి చెందాడు. కాకినాడకు చెందిన సోమశేఖర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.