హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలసిరి పనులపై సమీక్ష

MDK: చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో దామోదర్ ఆదేశించారు. వీబీజీ రామ్‌జీ పథకం సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఫామ్ పాండ్స్ పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు ప్రారంభించని రెండు గ్రామాల్లో వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు.