హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవాలి'

మెదక్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలని డీసీవో వరలక్ష్మి సూచించారు. పంటల సాగు విస్తీర్ణం పెంచకుండా ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలన్నారు. రైతులు పొలాల వద్ద ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని నీటి సరఫరా అధికారి తిరుపతిరెడ్డి కోరారు. ప్రతి ఇల్లు, వీధిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.