VKB: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 28వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుటుందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ


