సంగారెడ్డి: జిల్లా రామచంద్రారెడ్డినగర్ కాలనీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంకేతిక విప్లవంతో దేశాన్ని ప్రగతిపథంలో నిలిపిన రాజీవ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నాయకుల నివాళ్లు


