KNR: రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీకి ఘన నివాళులు


