హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువతకు ఉపాధి కల్పించాలి: బండి దత్తాత్రి

ADB: CCI పరిశ్రమను పునరుద్ధరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని CCI సాధన కమిటీ కో కన్వీనర్ బండి దత్తాత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో 12 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు సుభాష్ నగర్ కాలనీకి చెందిన యువకులు గురువారం సంఘీభావం ప్రకటించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.