హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

JN: డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఆధునిక సాంకేతిక విప్లవానికి, యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.