హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

VKB: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్‌ కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో రాజీవ్‌గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు.