హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటపాటలతో ప్రభుత్వ పథకాలపై అవగాహన'

ADB: ఇచ్చోడ మండలంలోని రఘు గూడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం గురువారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలపై కళాకారులు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రజలందరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.