హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ బాలికపై అఘాయిత్యం

JGL: కోరుట్ల పట్టణ శివారులోని నక్కలగుట్ట ప్రాంతంలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అదే ప్రాంతానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి బాలికను ఇంటి వద్ద దింపుతానని చెప్పి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.