హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాన్య ప్రజలతో నేరుగా మమేకమైన నాయకులు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం 'ప్రజావాణి' కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సామాన్య ప్రజలతో నేరుగా మమేకమై, వారు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను అత్యంత సావధానంగా అడిగి తెలుసుకున్నారు.