హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లకావత్‌ తండలో తీజ్‌ ఉత్సవాలు ప్రారంభం

WGL: రాయపర్తి మండలంలోని లకావత్‌ తండలో గురువారం తీజ్‌ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం బుట్టల్లో గోధుమలు వేసి తీజ్‌ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లకావత్‌ నరేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.. తీజ్‌ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. ఉత్సవాలు ఆనందోత్సాహాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.