NZB: సిరికొండ మండల కేంద్ర సర్పంచ్ సాయి చరణ్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథాగా వెళ్లనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించవచ్చని వివరించారు. ఇళ్ల పరిసరాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం


