నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్-ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిలో ఎస్‌పీటీ మార్కెట్ మూలమలుపు వద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. రహదారి ఎగుడుదిగుడుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఓ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉంది. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలతో ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి


