హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై కంపచెట్లతో ఇబ్బందులు

SRPT: కలకోవ నుంచి నడిగూడెం రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కంపచెట్లు కళ్లకు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు. రహదారి పక్కన పెరిగిన కంపచెట్లను వెంటనే తొలగించాలని కోరుతున్నారు.