హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల మయంగా ప్రధాన రహదారి..!

BHPL: కాటారం మండలంలోని గారెపల్లి అంబేడ్కర్‌ కూడలి నుంచి HP పెట్రోల్‌ బంక్‌ వరకు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలుచోట్ల ఏర్పడిన గుంతలు రోజురోజుకూ విస్తరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.