హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మద్యపాన నిర్మూలన ఉద్యమంలో పాల్గొనాలి'

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సహకరించాలని గ్రామ యువజన నాయకుడు రామ్ జన్నపాల పిలుపునిచ్చారు. మద్యం వల్ల కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును కాపాడటానికి, గ్రామంలో ప్రశాంతత కోసం మహిళలు, పెద్దలు కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొనాలన్నారు.