GDWL: మానవపాడు దళితవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట వర్షపు నీరు నిలవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వానకే నీరు నిలిచి మడుగులా.. మారుతుండటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు వృద్ధి చెంది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే మరమ్మతులు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
నిలిచిన వర్షపు నీరు.. ఇబ్బందుల్లో విద్యార్థులు


