వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి రెండో ప్రధాన ద్వారం ఎదుట రహదారి వర్షపు నీటితో బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగులు, వారి సహాయకులు వాహనాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఎంజీఎం ఆసుపత్రి గేట్ వద్ద గుంతల బాధ


