హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

ADB: దేశ ఐక్యతకు, టెక్నాలజీ పురోగతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యువత రాజకీయాల్లోకి రావాలని తలచిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.