MLG: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్రమంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధి, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. యువతకు అవకాశాలు, సాధికారత కల్పించడంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలి: సీతక్క


