KNR: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్థుల రిలే నిరాహార దీక్ష బుధవారం 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహిళలు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నారాయణపూర్‌ను పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించి, గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
తెలంగాణ
11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష


