హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోతారంలో జ్వరంతో చిన్నారి మృతి.!

PDPL: ముత్తారం మండలం పోతారంలో విషాదం నెలకొంది. జ్వరంతో అస్వస్థతకు గురైన లక్ష్మీప్రసన్న (7) గురువారం మృతి చెందింది. ఆమె చెల్లెలు సాహితి (4) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరికీ తొలుత ప్రైవేట్‌గా వైద్యం అందించగా పరిస్థితి విషమించడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మీప్రసన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.