హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి KTK-1 గనిలో కార్మికుడి అనుమానాస్పద మృతి..!

భూపాలపల్లి సింగరేణి KTK-1 బొగ్గు గనిలో బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గోపాల గోపి (39) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనపై తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గనుల్లో కార్మికుల భద్రతపై సింగరేణి సంస్థ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు గురువారం ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.