హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్

MLG: బీజేవైఎం ములుగు జిల్లా అధ్యక్షుడిగా మాదరి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొంతకాలంగా పార్టీలో చురుగ్గా పనిచేస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.