హైదరాబాద్: 28°C
తెలంగాణ

కదిలిన రైతులు.. కాల్వకు మరమ్మతులు

MLG: గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయం కింద ఆయకట్టు రైతులు చేయి చేయి కలిపారు. ఎకరాకు రూ. 300 చొప్పున విరాళాలు సేకరించి బుధవారం రంగాపూర్ ప్రధాన కాలువకు మరమ్మతులు చేపట్టారు. పొక్లెయినర్‌తో కాలువలోని పిచ్చిమొక్కలు, మట్టిని తొలగించారు. ప్రభుత్వం, నీటిపారుదల శాఖ నుంచి నిధులు రాకపోవడంతో రైతులే ముందుకొచ్చి కాలువను బాగు చేసుకున్నారు.