ASF: పెంచికల్పేట్ మండల కేంద్రంలో వింత దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. రోడ్డుపై ప్రశాంతంగా వెళ్తున్న ఆవు వీపుపై ఓ కోతి ఎలాంటి భయం లేకుండా కూర్చొని చక్కర్లు కొట్టింది. ఆవు నెమ్మదిగా నడుస్తుంటే, ఆ కోతి దానిపైనే కూర్చొని ప్రయాణించింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. పలువురు తమ సెల్ ఫోన్లలో ఈ వింత ప్రయాణాన్ని ఫొటోలు, వీడియోలు తీశారు.
తెలంగాణ
ఆవు వీపుపై కోతి స్వారీ


