హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం

KMR: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి-ఆజామాబాద్ ప్రధాన రహదారిపై శేమలవాగు సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు జరగకముందే కుంగిన ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.