ASF: ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగేతే కచ్చితంగా మోసం చేస్తున్నట్లేనని నిరుద్యోగులు గమనించాలని కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ప్రకటనలో తెలిపారు. అలాంటి వారి వలలో పడొద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్, విద్యార్హత నిబంధనలు ఉంటాయన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం అందించాలి అన్నారు.
తెలంగాణ
'ఉద్యోగాల పేరుతో మోసాలు'


