హైదరాబాద్: 28°C
తెలంగాణ

చినుకు పడితే చిత్తడే

ADB: ఉట్నూర్ మండలం చందూరి నుంచి రాజులగూడకు వెళ్లే ఏకైక మట్టి రహదారి అధ్వానంగా మారింది. వర్షం పడితే చిత్తడిగా మారడంతో రాకపోకలు కష్టంగా మారుతున్నాయి. గర్భిణులు, వృద్ధులు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం జారిపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి శాశ్వతంగా తారు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.