హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పగిలిన పైప్‌లైన్.. వృథాగా తాగునీరు

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మురుగు కాలువ నిర్మాణానికి తవ్వకాలు చేపట్టగా మిషన్ భగీరథ పైపైన్ పగిలిపోయింది. దీంతో విలువైన తాగునీరు కాలువలోకి చేరి వృథాగా పోతోంది. పైప్‌లైన్ పగలడంతో రహదారి బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.