హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల హాకీ.. నేడు ఇంగ్లండ్‌తో భారత్ ఢీ

మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. సాయంత్రం 6:30 గంటలకు ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇరుజట్ల మధ్య గ్రూ డి చివరి లీగ్ మ్యాచ్ జరగనుండగా.. దీనిని డ్రా చేసుకుంటే చాలు గ్రూప్ టాపర్‌గా భారత్ తదుపరి రౌండ్‌లో అడుగుపెడుతుంది. మరోవైపు మూడు పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్ మెగా టోర్నీలో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై గెలవడం తప్పనిసరి.