హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రియా సిమెంట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

SRPT: రామాపురంలో ప్రియా సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆసుపత్రిని నిర్వహిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, 18 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కోదాడ, జగ్గయ్యపేట వరకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.