SRD: ఎగువ ప్రాంతాల నుంచి సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 515.380 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులో 4.456 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 681 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
తెలంగాణ
సింగూర్ ప్రాజెక్ట్ నీటిమట్ట వివరాలు


