VKB: బషీరాబాద్ మండలంలో టాక్టర్లలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడి, స్వాధీనం చేసుకున్న ఇసుకను వేలం వేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ షాహిదాబేగం తెలిపారు. ఈనెల 21న మధ్యాహ్నం 2గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. 15 ట్రిప్పులు ఉందని, ఇసుక విలువ రూ.27,000 ఉంటుందన్నారు. 20 శాతం డిపాజిట్ చేసి కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని ఆమె సూచించారు.
తెలంగాణ
రేపు మండలంలో జప్తు చేసిన ఇసుకకు వేలం


