హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కుమారుడు

SRD: మద్యం మత్తులో తరచూ తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో కుమారుడు తండ్రిని గోతుకోసి చంపిన ఘటన జహీరాబాద్‌ మండలంలోని అల్లిపూర్‌లో జరిగింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శంకర్(70) కుటుంబం ఉపాధి నిమిత్తం కొన్నీళ్లుగా అల్లిపూర్‌లో ఉంటోంది. బుధవారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి భార్యను వేధించాడు. ఈ క్రమంలోనే తండ్రితో గొడవ జరగగా కత్తితో పొడిచి చంపాడు.