హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. వారం క్రితం క్వింటా రూ.2,500-3,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,500-5,500కి చేరింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.50-55కి చేరింది. మలక్‌పేట మార్కెట్‌కు కర్నూలు నుంచి రావాల్సిన దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర నుంచి వారం రోజులుగా సరఫరా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు.