హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస దొంగతనాలతో రాత్రి వేళ గస్తీ

NRML: నర్సాపూర్ (జి) మండలంలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. నందన్ గ్రామానికి చెందిన కొందరు ప్రజలు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ యువకులు గస్తీ నిర్వహిస్తే కొంతమేర భద్రత ఉంటుందన్నారు.