హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూలో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు నేడు ప్రారంభం

హన్మకొండ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ పోడేటి శ్రీనివాస్ తెలిపారు. వివిధ కోర్సులకు చెందిన 3,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.