WGL: శ్రావణమాసం సందర్భంగా గురువారం వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అభిషేకాలు చేసి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు


