MLG: వెంకటాపూర్ మండలం రామప్ప చెరువు ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ వరి పంటకు మొగి పురుగు, ఆకు ముడత పురుగు తీవ్రత పెరిగింది. వరి నాటిన 20 రోజులకే పంటను పురుగులు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగు నివారణకు తగిన క్రిమిసంహారక మందులను సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
వరికి పురుగుల బెడద.. రైతుల్లో ఆందోళన


