హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

MLG: కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అవసరమైన మందులు, వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు.