హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల గురుకులంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల సమీక్ష సమావేశానికి వచ్చిన ఆయన తొలుత బాలికల హాస్టల్‌ను పరిశీలించారు. 5, 6వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.