HNK: ములుగు-హుజూరాబాద్ ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. భీమదేవరపల్లి మూలమలుపు, కొప్పూర్, గాంధీనగర్ వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. రాత్రివేళ గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి గుంతలు సరి చేయాలని కోరారు.
తెలంగాణ
గుంతలమయమైన భీమదేవరపల్లి రహదారి


