హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఏశమోని శశి బాబు మాతృమూర్తి భాగ్యమ్మ బుధవారం రాత్రి చనిపోయారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మృతురాలి భౌతికకాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.